ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి జగన్ అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక అని అభివర్ణించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాషన్న ఆయన.. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అంటూ ట్వీట్ చేశారు.


శ్రీ కృష్ణ దేవరాయల వంటి స్వదేశీయుల నుండి సిపి. బ్రౌన్ వంటి విదేశీయులను కూడా ఆకర్షించిన తెలుగు భాష, వైసిపి పాలకుల దృష్టిలో చులకనవడం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇతర భాషలను నేర్చుకోడానికి పునాది మాతృభాష అని.. ఆ పునాదినే లేకుండా చేసి గాలిలో మేడలు కడతామనేవారిని ఏమనాలని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరికీ పుడుతూనే దక్కే వారసత్వ సంపద మాతృభాష అని అన్నారు.ఆంగ్ల మాధ్యమానికి తెలుగుదేశం వ్యతిరేకం కాదని.. ఏమాధ్యమంలో చదువుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉండాలన్నదే తెలుగుదేశం అభిమతమని చంద్రబాబు స్పష్టం చేశారు.ఈ ప్రభుత్వానికి తెలుగంటే మంత్రులు బూతులు మాట్లాడటానికి తప్ప, పిల్లలకు చదువు నేర్పించే మాధ్యమంగా పనికి రాదని అభిప్రాయం ఉందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. తెలుగు మన మాతృభాష కావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.


సామ్రాట్

Next Story