కోడి పందాలు.. పందెంరాయుళ్లు ఫాలో అయ్యే కుక్కుట శాస్త్రం గురించి తెలుసా?

మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో 'కుక్కుట' అంటారు.

By -  అంజి
Published on : 13 Jan 2026 1:43 PM IST

Cockfighting, Kukkuta Sastram , gamblers

కోడి పందాలు.. పందెంరాయుళ్లు ఫాలో అయ్యే కుక్కుట శాస్త్రం గురించి తెలుసా?

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆంధ్రాలో, మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కోడి పందాలు మొదలు అవుతాయి. ప్రభుత్వం ఈ పందాలపై నిషేధం విధించినా.. చాలా మంది వీటిని చాటుగా నిర్వహిస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల కోడి పందాలు సరదాగా జరిగితే.. మరికొన్ని చోట్ల జూదం పేరుతో ఆస్తులను కొల్లగొడుతాయి. అయితే ఈ కోడి పందాలను నిర్వహించే పందెం రాయుళ్లు కుక్కుట శాస్త్రంపై ఆధారపడతారు. ఈ శాస్త్రం ఆధారంగానే కోళ్లను రంగును బట్టి బరిలో దింపుతారు.

మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో 'కుక్కుట' అంటారు. దీని ప్రకారం తిథి, వార, నక్షత్రాలు.. కోళ్ల గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతాయని పందెం రాయుళ్లు నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఇవి కోడి పుంజుల రకాలను బట్టి ప్రభావం చూపుతాయట. ఏ వారంలో ఏ కోడి గెలుస్తుంది? ఏ ఘడియ, ఏ నక్షత్రంలో దానిని బరిలో దింపాలనేది ఈ శాస్త్రంలో ఉందట.

కుక్కుట శాస్త్రం ప్రకారం.. నక్షత్రాలను బట్టి అనుకూల రంగులున్న కోళ్లను బరిలోకి దింపుతారట. పందెం కట్టేవాళ్లు ఇంటికి బరి ఏ దిక్కున ఉందో చూసుకోవడంతో పాటు పేరులో తొలి అక్షరాన్ని బట్టి దిక్కును నిర్ణయించుకుంటారట. అది, శుక్రవారం అయితే ఉత్తర దిశ నుంచి.. సోమ, శనివారం అయితే దక్షిణ దిశ నుంచి.. మంగళవారం తూర్పు దిశ నుంచి, బుధవారం, గురువారం పడమన దిశ నుంచి కోళ్లను బరిలోకి దింపుతారట. వారాన్ని బట్టి ఈ దిశ మారుతుంది.

Next Story