దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి నేడు. తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ఆర్ అభిమానులు ఆయ‌న‌కు నివాళులర్పిస్తున్నారు. రాజ‌శేఖ‌ర రెడ్డి 72వ జ‌యంతిని పురస్క‌రించుకుని ఆయ‌న త‌న‌యుడు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భావోద్వేగ‌పు ట్వీట్ చేశారు.

'చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం.. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా... పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా' అంటూ ట్వీట్ చేశారు సీఎం.

రెండు రోజుల పాటు రాయలసీమలో జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ఆర్ స‌మాధి వ‌ద్ద సీఎం జ‌గ‌న్ నివాళుల‌ర్పించ‌నున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story