పారిస్‌ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్‌

CM YS Jagan arrives at Gannavaram airport after Paris tour.విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2022 1:23 PM IST
పారిస్‌ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్‌

విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నేడు(ఆదివారం) రాష్ట్రానికి చేరుకున్నారు. కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్‌ కాన్వొకేషన్‌ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జ‌గ‌న్ దంప‌తులు పారిస్ వెళ్లారు. ఆ కార్య‌క్ర‌మం ముగిసిన వెంట‌నే ఏపీకి తిరుగు ప్ర‌యాణం అయ్యారు. ఆదివారం ఉద‌యం గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయ‌న‌కు మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఇతర జిల్లా అధికారులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.

జూన్ 28న సీఎం జ‌గ‌న్ దంప‌తులు ఫ్రాన్స్‌కు వెళ్లి జూలై 2న పారిస్‌లోని ఇన్‌సీడ్‌ బిజినెస్ స్కూల్‌ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబీఏ) పూర్తి చేసిన తన పెద్ద కుమార్తె హర్షిణి గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు హాజరయ్యారు. తన కుమార్తె విజయవంతంగా ఎంబీఏ పూర్తిచేసినందుకు దేవుడి ఆశీస్సులు ఉంటాయని పేర్కొంటూ ట్విట్టర్‌లో తమ ఫొటో షేర్‌ చేశారు.

Next Story