గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు

CM YS Jagan another good news to village ward secretariat employees. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గ్రామ, సచివాలయ

By అంజి  Published on  31 Oct 2022 12:04 PM IST
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గ్రామ, సచివాలయ ఉద్యోగులను ఆరోగ్య పథకం (EHS) పరిధిలోకి తీసుకురావాలని సీఎం జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ కార్డులు ఇస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్‌ కార్యాలయం, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ కార్డుల జారీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోకు మూడు రోజుల క్రితం లేఖ రాసింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించి భర్తీ చేసిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం అర్హులైన సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల ప్రొబేషన్‌ను ఖరారు చేసింది. ఇప్పుడు ఏకకాలంలో లక్ష మందికి పైగా ఉద్యోగులను ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్హులైన సచివాలయ ఉద్యోగులందరికీ EHS కార్డులు జారీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ చర్యలు చేపట్టింది. ఈహెచ్ఎస్ పథకం కిందకు సచివాలయ ఉద్యోగుల్నితీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందబోతున్నారు.

ఈహెచ్ఎస్ ప్రయోజనాలివే..

*ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి రావడం వల్ల సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వైద్య చికిత్సలు అందుతాయి.

*ఇందులో క్యాష్ లెస్, రీయింబర్స్ మెంట్ కూడా ఉన్నాయి.

*ప్రభుత్వం జారీ చేసే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల్ని వాడుకుని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు వీరికి అవకాశం లభిస్తుంది.

*ఈ పథకం కింద నెలకు 300 రూపాయల చొప్పున ఉద్యోగుల ఖాతాల్లో డెబిట్ చేస్తారు.

*అలాగే ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్య ప్రయోజనం పొందుతారు.

Next Story