వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్

సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

By Srikanth Gundamalla  Published on  6 March 2024 1:34 PM IST
cm jagan, veligonda project, andhra pradesh,

వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్ 

సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరిందని సీఎం జగన్ అన్నారు. అయితే.. అంతకుముందు సీఎం జగన్‌ వెలిగొండ ప్రాజెక్టు మొత్తం కాన్వాయ్‌ లో వెళ్లి పరిశీలించారు. టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

వెలిగొండ ప్రాజెక్టుకు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టును తాను పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్‌ అంటూ సీఎం జగన్ చెప్పారు. 15.25 లక్షల మంది తాగునీటి సమస్య ఈ ప్రాజెక్టు ద్వారా తీరుతుందని సీఎం జగన్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం జగన్ వెల్లడించారు.

Next Story