మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా సీఎం జ‌గ‌న్ నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో స‌ర్వేప‌ల్లి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి.. ఆయ‌న సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ పాల్గొన్నారు.

అంత‌క‌ముందు.."చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్‌ డే శుభాకాంక్షలు" అంటూ సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story