CM Jagan : రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్
ఒంటిమిట్టలో రేపు(బుధవారం) సీఎం జగన్ పర్యటించనున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 6:12 AM GMTఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5 బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒంటిమిట్టను సందర్శించనున్నారు. స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుగుప్రయాణం కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది
జగన్ ఒంటిమిట్ట పర్యటన వివరాలు ఇవే..
- మధ్యాహ్నం 12.50 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. 1.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- 1.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
- కడప ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.25 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు.
- 2.40 నుంచి 3.15 వరకు విశ్రాంతి తీసుకుంటారు.
- 3.25 కు టీటీడీ అతిథి గృహం నుంచి బయలుదేరి కోదండస్వామి ఆలయానికి చేరుకుంటారు.
- 3.30 నుంచి 3.50 వరకు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- 3.55కి అక్కడి నుంచి బయలుదేరి టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు.
- 4.25కి రోడ్డు మార్గం ద్వారా కడప ఎయిర్‌పోర్టుకు వెలుతారు.
- సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెలుతారు.
సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కడప జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు