వైఎస్ఆర్ ఫించ‌న్ పెంపు.. ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

CM Jagan speech in YSR Pension Kanuka hike program.ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ తీసుకునే వారికి ముఖ్యమంత్రి వైఎస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2022 7:43 AM GMT
వైఎస్ఆర్ ఫించ‌న్ పెంపు.. ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ తీసుకునే వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర కానుక అందించారు. వైఎస్ఆర్ ఫించ‌న్ కానుక ప‌థ‌కం కింద వృద్ధులు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌లు, త‌దిత‌రుల‌కు రూ.250 ఫించ‌న్‌ పెంపు కార్య‌క్ర‌మాన్ని గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడులో సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. అనంత‌రం పెంచిన రూ.250 ఫించ‌న్‌తో క‌లిపి మొత్తం ఒక్కొక్క‌రికి రూ.2500 చొప్పున పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్ర‌తి హామీని నేర‌వేరుస్తున్న‌ట్లు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఫించ‌న్ రూ.2,250కి పెంచామ‌ని.. ఇప్పుడు మ‌రో రూ.250 పెంచిన‌ట్లు తెలిపారు. మొత్తంగా రెండున్న‌రేళ్ల‌లో రూ.2500 పెంచిన‌ట్లు చెప్పారు. కొత్త సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్ర‌జ‌లంద‌రికి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ది బాట‌లో న‌డిపిస్తున్న‌ట్లు చెప్పారు. ఇక మంచి చేస్తుంటే విమ‌ర్శించే వాళ్లు ఉంటార‌న్నారు.

విమ‌ర్శించే వాళ్ల‌కు తాము చేసే అభివృద్ది క‌నిపించ‌డం లేదా..? అని సీఎం ప్ర‌శ్నించారు. ఫించ‌న్ ను రూ.3వేల‌కు పెంచుతామ‌న్న మాట‌ను నిల‌బెట్టుకుంటామ‌ని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో 62 ల‌క్ష‌ల మందికి పించ‌న్‌ను అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఇక అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తున్నామ‌ని.. కొంద‌రు ఓర్వ‌లేక కోర్టుకు వెళ్లి అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్నార‌న్నారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పైనా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. వారు మంచి జ‌ర‌గ‌కూడ‌ద‌ని, ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డాల‌ని ఆలోచిస్తున్నార‌ని.. క‌నీసం కొత్త ఏడాదిలోనైనా విమ‌ర్శ‌కులకు మంచి ఆలోచ‌న‌లు రావాల‌న్నారు.

Next Story