పేద‌వాడి సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నాం : సీఎం జ‌గ‌న్‌

CM Jagan speech in Jagananna sampoorna gruha hakku launching Program.రాష్ట్రంలో ప్ర‌తి పేద‌వాడి సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నామ‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 9:37 AM GMT
పేద‌వాడి సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నాం : సీఎం జ‌గ‌న్‌

రాష్ట్రంలో ప్ర‌తి పేద‌వాడి సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకులో జ‌గ‌నన్న గృహ సంకల్ప పథకాన్ని మంగ‌ళ‌వారం సీఎం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌తి నిరుపేద సొంతింటి కోసం జీవిత‌కాలం కృషి చేస్తార‌ని.. ఇల్లు అంటే ఇటుక‌లు, స్టీల్‌తో క‌ట్టిన నిర్మాణం మాత్ర‌మే కాద‌న్నారు. సుదీర్ఘ‌కాలం ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం అన్నారు. గృహ హ‌క్కు ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో రూ.16వేల కోట్ల రుణ‌మాఫీ చేస్తున్నామ‌న్నారు. నామ‌మాత్ర చెల్లింపుతో ల‌బ్దిదారుల ఇంటిని వారికి సొంతం చేస్తున్నామ‌న్నారు.

లబ్దిదారుల ఆస్తి 22A లో నిషేధిత ఆస్తిగా ఉండేదని, ఇక నుండి నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా లబ్ది పొందిన వారికి లింక్ డాక్యుమెంట్ కూడా అవసరం లేదని, ఓటీఎస్ ద్వారా క్లియర్ టైటిల్ ఇస్తున్నామన్నారు. దీని వ‌ల్ల ఆస‌క్తి విలువ పెరుగుతుంద‌ని, ఇంటిని అమ్ముకునే హ‌క్కు కూడా ఉంటుంద‌న్నారు. ప్ర‌భుత్వం మంజూరు చేసిన వాటిలో 52ల‌క్ష‌ల మందికి ఇంటిపై హ‌క్కు ఉండ‌టం లేద‌ని ఈ కార‌ణం చేత‌నే సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కాన్ని తీసుకొచ్చామ‌న్నారు. ఉచితంగా రిజిస్ట్రేష‌న్లు చేసి డాక్యుమెంట్లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

2014 నుండి 2019 అధికారంలో ఉన్న‌ చంద్రబాబు మంచి చేయలేదన్నారు. రుణం మాట కాదు అసలు వడ్డీ మాఫీ కె దిక్కు లేదని ఎద్దేవా చేశారు. కనీసం వడ్డీ మాఫీ చేయండి అని ఫైల్ చంద్రబాబుకి అధికారులు పంపిస్తే వెనక్కి పంపారన్నారు. పేదవాడికి మంచి జరిగితే చూడలేకపోతున్నారన్నారు. జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులను కొన్ని ప్రశ్నలు వేయాల‌ని చెప్పారు. రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ లేకుండా మార్కెట్ రేటుకు మీరు కొంటారా..? అని ప్ర‌శ్నించండ‌న్నారు. గ‌త 30నెల‌ల కాలంలో బ‌ట‌న్ నొక్కి అవినీతి ర‌హితంగా న‌గ‌దు బ‌దిలీ చేశామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.

Next Story