పేదరికాన్ని పారద్రోలేందుకే జగనన్న విద్యాకానుక
CM Jagan speech in Distribution Jagananna Vidya Kanuka in Adoni.పేదరికాన్ని పారద్రోలేందుకే జగనన్న విద్యాకానుక
By తోట వంశీ కుమార్ Published on 5 July 2022 3:43 PM ISTపేదరికాన్ని పారద్రోలేందుకే జగనన్న విద్యాకానుక పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యాకానుక పథకం కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నామని, విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలని, నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలన్నారు. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని జగన్ అన్నారు.
పిల్లల భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం మాదేనని అన్నారు. అందుకనే విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలి రోజునే విద్యాకానుక అందిస్తున్నట్లు చెప్పారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నామని, ఒక్కో కిట్ విలువ రూ.2వేలు ఉంటుంద్నారు. విద్యార్థుల ఖర్చు గురించి ఎక్కడా వెనక్కి తగ్గలేదని అన్నారు. ఇక ఈ ఏడాది 8వ తరగతి విద్యార్థుల కోసం ట్యాబ్‌లు అందించబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసమే బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఆదోనికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.