ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసి నేటికి స‌రిగ్గా రెండేళ్లు. ఈ సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ఓ పుస్త‌కాన్ని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. అంద‌రి స‌హ‌కారంతోనే రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకోగ‌లిగామ‌న్నారు. గ్రామ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు, మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని తెలిపారు.

ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఏపీ ప్రజలకు ఇవ్వగలిగామని.. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతానని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశామ‌న్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికారంలోకి వచ్చిన తాను అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నానన్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story