ముగిసిన సీఎం జగన్ పోలవరం పర్యటన
CM Jagan Polavaram project tour has ended.పోలవరంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ పర్యటన ముగిసింది. ప్రాజెక్టు
By తోట వంశీ కుమార్ Published on 19 July 2021 2:57 PM ISTపోలవరంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ పర్యటన ముగిసింది. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం స్వయంగా పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు జగన్‌కు వివరించారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్షించారు. స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తయ్యాయని అధికారులు వివరించారు.
స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తి చేశామని, 48 గేట్లలో 42 గేట్లు అమర్చినట్లు, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని అధికారులు తెలిపారు. జర్మనీ నుంచి సిలెండర్ల వచ్చాయని, ఎగువ కాఫర్‌డ్యాంలో అదివరకు ఉన్న ఖాళీలను పూర్తిచేశామన్నారు. ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాం (ఈసీఆర్‌ఎఫ్)పనుల గురించి సీఎం జగన్ ఆరా తీశారు. కాఫర్ డ్యాంలో ఖాళీలు కారణంగా గతంలో వచ్చిన వరదలకు ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ప్రాంతం దెబ్బతిందని, దీనిపనులు ఎలా చేయాలన్నదానిపై డిజైన్లు కూడా ఖరారు చేస్తున్నామని వెల్లడించారు. 2022 జూన్‌కల్లా లైనింగ్‌తో కలుపుకుని రెండు కాల్వలకు లింకు పనులు పూర్తికావాలని, టన్నెల్ పనులు, లైనింగ్ పనులు కూడా పూర్తిచేయాలని జగన్ ఆదేశించారు. ఈ డిసెంబర్ కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. అలాగే ఆర్ అండ్ ఆర్ పనులపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.