ప్రజలకు మంచి చేసినా ఓడిపోయాం.. ఫలితాలపై సీఎం జగన్ భావోద్వేగం
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది.
By Srikanth Gundamalla
ప్రజలకు మంచి చేసినా ఓడిపోయాం.. ఫలితాలపై సీఎం జగన్ భావోద్వేగం
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా నిలబెట్టుకోలేకపోయిది. ఏకంగా కేబినెట్‌లో కొనసాగిన మంత్రులే ఓటమిని చూశారు. ఇక ముఖ్యమంత్రి జగన్ గతంలో కంటే తక్కువ మెజార్టీతో గట్టెకట్టారు. తాజాగా ఏపీలో అసెంబ్లీ ఫలితాలపై సీఎం జగన్ మాట్లాడారు. ఈ మేరకు భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రజలకు మంచి చేసినా ఎందుకు ఇంతటి ఘోర ఓటమి ఎదురైందో అర్థం కావడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రజలకు కష్టాల్లో తోడుగా ఉన్నామని చెప్పారు. బెనిఫిట్స్ ఇంటికే పంపే వ్యవస్థను తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఎవరు మోసం చేశారో.. అన్యాయం చేశారో అనొచ్చేమోగానీ.. ఆధారాల్లేవని అనడం గమనర్హం అన్నారు జగన్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజలకు ఎంత మంచి చేసినా ఓటమి పాలయ్యామని జగన్ వ్యాఖ్యానించారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఇలా ఎందుకు జరిగిందో అని జగన్ అన్నారు.
చాలీచాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేశామన్నారు సీఎం జగన్. అవ్వాతాతలు చూపిన అప్యాయత ఇప్పుడేమైందో తెలియట్లేదన్నారు. దాదాపు కోటి 5లక్షల మందికి పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు, వారి కష్టాలే తమ కష్టాలు భావించామన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా అన్ని విధాలా అండగా నిలిచామన్నారు. ఆసరాతో తోడుగా ఉన్నా.. చేయూత అందించామన్నారు. వారందరి ప్రేమాభిమానాలు ఏమయ్యాయో అంటూ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ భావోద్వేగం అయ్యారు.