మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు.
By తోట వంశీ కుమార్ Published on 21 March 2023 10:57 AM IST
మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌లను మహిళలు తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా.. ఇప్పటి వరకు పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలనే నిబంధన ఉండేది. ప్రస్తుతం దీనిని సవరించారు.
ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతలు ముఖ్యమంత్రి జగన్‌ను సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యను ప్రత్యేకంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్పందిన సీఎం వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. పిల్లల సంరక్షణకు అవకాశం ఉంటుందని మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్‌ను 3 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పెంచాలని ఎమ్మెల్సీలు కోరగా.. దీనిపైనా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.