MLC Elections : ఓటు హ‌క్కు వినియోగించుకున్న సీఎం జ‌గ‌న్‌

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2023 5:07 AM GMT
MLC Elections : ఓటు హ‌క్కు వినియోగించుకున్న సీఎం జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభ‌మైంది. వెల‌గ‌పూడిలోని శాసనసభ మొదటి అంతస్థులో గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది. తొలుత సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత, ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొలుసు పార్థసారథి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


మొత్తం 175 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటివరకు 40 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏడుగురు వైసీపీ, ఓ టీడీపీ అభ్య‌ర్థి బ‌రిలో ఉన్నారు. సాయంత్రం ఐదు గంట‌ల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. అనంత‌రం ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

Next Story