అవనిగడ్డలో నేడు సీఎం జగన్ పర్యటన
CM Jagan Avanigadda Tour today.కృష్ణా జిల్లా అవనిగడ్డలో గురువారం ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు.
By తోట వంశీ కుమార్
కృష్ణా జిల్లా అవనిగడ్డలో గురువారం ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 22ఏ(1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు ముఖ్యమంత్రి అందజేయనున్నారు. నిషేధిత భూముల సమస్యను సీఎం పరిష్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,600 ఎకరాల భూములకు చెందిన 22వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్..
- తాడేపల్లిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు సీఎం జగన్ అవనిగడ్డకు బయలుదేరుతారు.
- 11 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు.
- గంటన్నర పాటు సాగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.
- ఈ సభలో డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేయనున్నారు.
- సంక్షేమ పథకాల స్టాల్స్‌ను పరిశీలించనున్నారు.
- సభలో ప్రసంగించిన అనంతరం అవనిగడ్డ నుంచి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు
అవనిగడ్డలోని సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 1,350 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొనున్నారు. సీఎం బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ప్రత్యేకంగా 500 బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు.