Video: సీఎం టు టీచర్..పుట్టపర్తి స్కూల్‌ విద్యార్థులకు చంద్రబాబు పాఠాలు

ఏపీ సీఎం చంద్రబాబు ఉపాధ్యాయుడిగా మారారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు

By Knakam Karthik
Published on : 10 July 2025 2:00 PM IST

Andrapradesh, Cm Chandrababu, Puttaparthi school, parent teacher meeting,

Video: సీఎం టు టీచర్..పుట్టపర్తి స్కూల్‌ విద్యార్థులకు చంద్రబాబు పాఠాలు

ఏపీ సీఎం చంద్రబాబు ఉపాధ్యాయుడిగా మారారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. గురువారం ఉదయం పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ స్కూల్ లో చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మాస్టారుగా మారి వారికి పాఠాలు బోధించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు గురువారం ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా కొత్తచెరువు జెడ్పీ స్కూల్ కు వెళ్లారు. సీఎం చంద్రబాబుకు ఎన్సీసీ కేడెట్ లు గౌరవ వందనం సమర్పించి స్వాగతించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, వార తల్లిదండ్రులతో చంద్రబాబు మాట్లాడుతూ.. విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను మంత్రి నారా లోకేశ్ తో కలిసి తిలకించారు. అనంతరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్ లో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా స్కూలు క్యాంపస్ ను పరిశీలించిన చంద్రబాబు.. క్యాంపస్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు సీఎం చంద్రబాబు కొద్దిసేపు పాఠాలు బోధించారు.

Next Story