పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలకు ప్రభుత్వ పెద్దలు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టపర్తికి విచ్చేయనున్నారు. పుట్టపర్తికి రానున్న వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పుట్టపర్తికి రానున్నారు. ప్రధానమంత్రి పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను చేసేందుకు, రవాణా సౌకర్యం కోసం ముగ్గురు ఐఏఎస్ లను నియమించింది.