అనంత్-రాధిక వివాహ విందుకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు.
By Srikanth Gundamalla Published on 13 July 2024 9:58 AM ISTఅనంత్-రాధిక వివాహ విందుకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు. సాయంత్రం ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ విందుకు హాజరు కానున్నారు. అంతకుముందు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి వెళ్లనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతలను చంద్రబాబు స్వీకరించనున్నారు.
కాగా.. ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించేందుకు ఇటీవల టోల్‌ఫ్రీ నంబర్‌ను పల్లా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన కార్యాలయంలోనే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ విందు కార్యక్రమానికి వెళ్తారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారు. విందు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ముంబైలోనే సీఎం చంద్రబాబు బస చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.