ఏపీ నామినేటెడ్ పోస్టులు భర్తీ..లిస్టులో వారికే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్‌లో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.
By Knakam Karthik
ఏపీ నామినేటెడ్ పోస్టులు భర్తీ..లిస్టులో వారికే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్‌లో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ, జనసేన నేతలకు మాత్రమే ఈసారి చాన్స్ ఇచ్చారు. 10 జిల్లాలకు సహకార బ్యాంకు, సంఘాల చైర్మన్లను నియమించారు. ఈ మేరకు లిస్టు విడుదల చేశారు.
శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్ పోస్టును టీడీపీ చెందిన శివ్వల సూర్యానారాయణకు కేటాయించారు. విశాఖ డీసీసీబీ చైర్మన్ పదవిని జనసేనకు చెందిన కోన తాతారావుతో భర్తీ చేశారు. విజయనగరం డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత కమిడి నాగార్జునను నియమించారు. గుంటూరు డీసీసీబీ చైర్మన్‌గా మాకినేని మల్లికార్జునరావు(టీడీపీ), కృష్ణా డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత నెట్టెం రఘురామ్, నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌గా ధనుంజయరెడ్డి (టీడీపీ), చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ నేత అమాస రాజశేఖర్ రెడ్డిని నియమించారు. అనంతపురం డీసీసీబీ చైర్మన్‌గా కేశరెడ్డి (టీడీపీ), కర్నూలు డీసీసీబీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన డి. విష్ణువర్ధన్ రెడ్డి, కడప డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత బి. సూర్యనారాయణరెడ్డి నియమించారు.
డీసీఎంస్ చైర్మన్ పదవులను కూడా భర్తీ చేశారు. వీరి లిస్ట్ ఇదే శ్రీకాకుళం డీసీఎంస్ చైర్మన్‌గా టీడీపీ నేత అవినాశ్ చౌదరి, విశాఖ డీసీఎంస్ చైర్మన్ గా కొట్ని బాలాజీ (టీడీపీ), విజయనగరం డీసీఎంస్ చైర్మన్‌గా గొంప కృష్ణ(Tdp), గుంటూరు డీసీఎంస్ చైర్మన్‌గా వడ్రాణం హరిబాబు(Tdp), కృష్ణా డీసీఎంస్ చైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన బండి రామకృష్ణను నియమించారు. నెల్లూరు డీసీఎంస్ చైర్మన్‌గా టీడీపీ నేత గొనుగోడు నాగేశ్వరరావు, చిత్తూరు డీసీఎంస్ చైర్మన్‌గా సుబ్రహ్మమణ్యం నాయుడు(టీడీపీ), అనంతపురం డీసీఎంస్ చైర్మన్‌గా నెట్టెం వెంకటేశ్వర్లు (TDP), కర్నూలు డీసీఎంస్ చైర్మన్‌గా జి. నాగేశ్వరయాదవ్(తెలుగుదేశం పార్టీ), కడప డీసీఎంస్ చైర్మన్ గా టీడీపీ చెందిన యర్రగుండ్ల జయప్రకాశ్‌ను నియమించారు. ఈ మేరకు లిస్టు విడుదల చేశారు.