రెండేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు తొలిదశ పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు.

By Srikanth Gundamalla  Published on  11 July 2024 11:05 AM GMT
cm chandrababu, comments,  bhogapuram airport ,

 రెండేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు తొలిదశ పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు తొలిదశను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అందుతాయని చెప్పారు. దీనిని పూర్తి చేసే బాధ్యత కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుపై ఉందన్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకంగా మారుతుందని చెప్పారు. గ్రోత్‌ ఇంజిన్‌గా విమానాశ్రయం పనిచేస్తుందని తెలిపారు. ఎయిర్‌పోర్టు పూర్తయితే భోగాపురం ప్రాంతం ఎకనమిక్‌ హబ్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందుతుంనది అన్నారు. భోగాపురం వరకు బీచ్‌ రోడ్డు నిర్మాణం కావాల్సి ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఇలా గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధిలో వృథా అయ్యాయన్నారు. భోగాపురం విమానాశ్రయానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయన్నారు. ఎన్నో అంశాలు మళ్లీ మొదటికి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అద్భుత విజయాన్ని అందించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామన్నారు. భవిష్యత్‌లో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని వ్యాక్యానించారు. విశాఖకు మెట్రో రావాల్సి ఉందనీ.. మున్ముందు కుప్పం సహా ఐదు విమానాశ్రయాలు వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పారు.

Next Story