శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న‌ సీజేఐ ఎన్వీ రమణ దంపతులు

CJI NV Ramana couples visit Srisailam Temple.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంప‌తులు ప్రస్తుతం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2021 10:36 AM IST
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న‌ సీజేఐ ఎన్వీ రమణ దంపతులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంప‌తులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్ర‌వారం ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలాన్ని దర్శించనున్నారు. భ్ర‌మ‌రాంబ‌, మ‌ల్లికార్జున స్వామి వార్ల‌ను ద‌ర్శించుకుని.. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

ఈ ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఆయన 9 గంటలకు శ్రీశైలం దేవస్థానం అతిథి గృహానికి చేరుకున్నారు. సీజేఐ దంపతులకు నంది నికేత‌న్ అతిథి గృహం వద్ద ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ వీర‌పాండియ‌న్‌, ఆల‌య ఈవో కేఎస్ రామారావు త‌దిత‌రులు పుష్ప‌గుచ్చాల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అర్చ‌కులు పూర్ణ‌కుంభం, వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల‌తో ఆల‌యంలోకి ఆహ్వానించారు. స్వామివారి దర్శనం అనంతరం 10 గంటల 30 నిమిషాలకు తిరిగి ఎన్వీ రమణ దంపతులు హైదరాబాద్ కు తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం ఆల‌యం వ‌ద్ద అధికారులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. కాగా.. ఇటీవలే సీజేఐ దంప‌తులు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే.

Next Story