ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠ‌శాల స‌మీపంలో సిగరెట్, పాన్‌ షాపులు క్లోజ్‌

Cigarette and pan selling shops near schools are closed in AP.విద్యార్థుల భ‌విష్య‌త్తుపై ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2021 4:25 AM GMT
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠ‌శాల స‌మీపంలో సిగరెట్, పాన్‌ షాపులు క్లోజ్‌

విద్యార్థుల భ‌విష్య‌త్తుపై ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. విద్యార్థులు చెడు అల‌వాట్ల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా ఉండేందుకు చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ స్కూల్‌కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్‌లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇక ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను పరిశీలించే బాధ్యతను ఏఎన్ఎం లకు అప్పగించారు.

ఒక్కో ఏఎన్‌ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఏఎన్‌ఎం వెళ్లి స్కూలు సమీపంలోని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. దీనికోసం ఒక ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్‌ ద్వారా అక్కడి ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఎవరైనా సిగరెట్, గుట్కా వంటి షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక‌ పాఠశాల సమీపంలో సిగరెట్ తాగడాన్ని కూడా నిషేదించారు. మద్యం దుకాణాలు పాఠశాలకు సమీపంలో లేకుండా చేస్తున్నారు. ప్రతి పాఠ‌శాల‌ను పర్యవేక్షణ కోసం మ్యాపింగ్‌ చేస్తారు. మ్యాపింగ్‌ అనంతరం వీటిని ఆన్‌లైన్‌ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదని ఈ చర్యలు చేపట్టారు. అలాగే స్కూల్‌ ఆవరణలో స్మోకింగ్‌ వల్ల వచ్చే అనర్థాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేస్తారు. టీచర్లు ఎవరైనా స్కూల్‌ ఆవరణలో స్మోకింగ్‌ చేస్తే.. వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు.

Next Story
Share it