తిందామనుకుంటే.. షాకిచ్చిన చికెన్, మటన్ ధరలు

దసరా సమయంలో మాంసాహార వంటకాలను తినడానికి

By Medi Samrat  Published on  13 Oct 2024 6:19 PM IST
తిందామనుకుంటే.. షాకిచ్చిన చికెన్, మటన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పాడ్యమి రోజున నాన్ వెజ్ ప్రియులు ఇష్టమైన వంటకాలతో ఎంజాయ్ చేస్తుండగా.. మరో వైపు భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలతో మిడిల్ క్లాస్ జనం ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంతటా చికెన్, మటన్ ధరలలో గణనీయమైన పెరుగుదల గమనించారు. దసరా ముందు రోజు అక్టోబర్ 13న కిలో మటన్ ధర సుమారు రూ.900 పలికింది. అక్టోబర్ 14న మాంసం దుకాణాల వద్ద మంచి రద్దీ కనిపించింది.

దసరా సమయంలో మాంసాహార వంటకాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నవరాత్రుల సమయంలో చాలా మంది నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. ఇక నవరాత్రులు ముగియడంతో ప్రజలు మాంసం కొనుగోలు చేయడానికి తరలిరావడంతో మార్కెట్‌ల వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో స్కిన్‌లెస్ చికెన్ ధరలు కిలో రూ.240 నుంచి రూ.260 వరకు ఉన్నాయి.

విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాధారణంగా అమ్మేదాని కంటే చికెన్‌ను సుమారు ₹20 ఎక్కువ ధరలకు విక్రయించారు. మటన్ విషయంలో కూడా 100 రూపాయలు ఎక్కువ చేసి అమ్మారు.


Next Story