ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు.. ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్‌తో.. వంద అడుగుల సీఎం ముఖచిత్రం
Chevireddy Bhaskar Reddy Birthday wishes to CM Jagan.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. దీంతో
By తోట వంశీ కుమార్ Published on 21 Dec 2021 9:25 AM ISTముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. దీంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక సామాజిక మాధ్యమాల వేదికగా జగన్‌కు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ అన్నదానం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు.
సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ఆవరణలోని గోశాల ముందు ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ విధానంలో గ్రాస్‌పై సీఎం జగన్ ముఖచిత్రాన్ని ఏర్పాటు చేయించారు. వంద అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పుతో 2డీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలి ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ ఇదే కావడం విశేషం. దీన్ని ఆర్టిస్ట్ కాంత్ రీషా వేశారు. ఈ ముఖచిత్రం కోసం గత పదిరోజులుగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి దగ్గరుండి పనులు చేయించారు. ఇక డ్రోన్‌పై నుంచి చూస్తే సీఎం ముఖచిత్రం ఎంతో అందంగా కనబడుతోంది.
సీఎంపై అధిపతి అనే టైటిల్‌తో రూపొందించిన 'వర్థిల్లు.. వెయ్యేళ్లు' పాట ఆడియో సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దార్శనికత ఉంటే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చో సీఎం జగన్ చేసి చూపించారన్నారు. పేదలు అన్ని రంగాల్లో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. జనహృదయ నాయకుడికి తామంతా శుభాకాంక్షలు చెబుతున్నామన్నారు.