చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురయింది.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 5:10 PM ISTచంద్రబాబు రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 19 వరకు రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్టు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రెండోసారి విధించిన రిమాండ్ గడువు ముగియడంతో మరోసారి అక్టోబర్ 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాల జారీ చేసింది.
ఈ నేపథ్యంలో జైలు అధికారులు చంద్రబాబుని వర్చువల్‌గా ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ను రెండువారాల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదరనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా.. విచారణ సందర్భంగా ఇరు వైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చంద్రబాబుకి బెయిల్ లభిస్తుందా లేదా అన్నది శుక్రవారం తేలనుంది.