ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. ఎందుకు వెళ్తున్నారంటే?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. సోమవారం నాడు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2023 9:01 AM ISTఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. ఎందుకు వెళ్తున్నారంటే?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. సోమవారం నాడు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఇదేమీ అఫీషియల్ పని కోసం కాదనుకోండి. సుప్రీంకోర్టు న్యాయవాది సిదార్ధ లూథ్రా కుమారుని వివాహం ఆదివారం నాడు.. రిసెప్షన్ సోమవారం జరగనుంది. హోటల్ రీజెన్సీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. లూథ్రా కుటుంబం ఆహ్వానం మేరకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఈ రిసెప్షన్‌కు హాజరు కానన్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. 28వ తేదీ వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయన రాజకీయ కార్యకలాపాలను పునఃప్రారంభించాలని టీడీపీ నాయకత్వం ఉవ్విళ్లూరుతోంది. ఏఐజీ ఆసుపత్రిలో వైద్య చికిత్స ద్వారా చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడింది. ఇటీవల ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఇక ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. తాత్కాలిక ప్రణాళికల ప్రకారం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లు భవిష్యతుకు భరోసా, యువ గళం కార్యక్రమాలను పునఃప్రారంభించనున్నారు.