తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యం : చంద్రబాబు
Chandrababu Naidu comments on party 40th formation day.తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సరం వేడుకలను ఆ పార్టీ
By తోట వంశీ కుమార్ Published on 29 March 2022 6:06 AM GMTతెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సరం వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేననని అన్నారు.
'తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నలభై సంవత్సరాల క్రితం 1982, మార్చి 29న ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యం. కొందరు వ్యక్తుల కోసమో.. కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశం. ప్రజల కోసం.. ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం.. ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. కొందరికే పరిమితం అయిన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి..సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదే.పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే.ప్రాంతీయ పార్టీ గా ఉన్నా.. జాతీయ భావాలతో సాగే పార్టీ టీడీపీ. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా తెలుగుదేశం 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించండి.ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలి. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలని' చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2022
నలభై సంవత్సరాల క్రితం 1982, మార్చి 29న ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం....ఒక రాజకీయ అనివార్యం.(1/5)#40GloriousYearsOfTeluguDesam#TDPFoundationDay pic.twitter.com/0sAB67xDL2