రాష్ట్రాన్ని వైసీపీ నేరాంధ్రప్రదేశ్‌గా మారుస్తోంది: చంద్రబాబు

జగన్ పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న

By Srikanth Gundamalla  Published on  18 Jun 2023 12:45 PM GMT
Chadrababu, TDP, YCP, AP Government

రాష్ట్రాన్ని వైసీపీ నేరాంధ్రప్రదేశ్‌గా మారుస్తోంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న నేరాలపై ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక..నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు.

సీఎం జగన్ పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలకు వైసీపీనే కారణమని విమర్శించారు. బాపట్ల జిల్లాలో బాలుడి సజీవదహనం సహా పలు అంశాలను చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ వైఖరి, వైసీపీ ప్రభుత్వం వైఖరి నేరగాళ్లకు ఊతమిచ్చేలా ఉందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత లేదన్నారు. పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. కేసులు నమోదు చేసినా.. నిందితులను మాత్రం పట్టుకోవడం లేదని విమర్శించారు.

అంతేకాదు.. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదన్నారు చంద్రబాబు. పలు ప్రాజెక్టులు చేపట్టిన వారు ప్రభుత్వం నుంచి అందాల్సిన బిల్లులు రాక గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఏపీ నేరాలకు కేరాఫ్‌గా మారుతోన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో గన్‌ కల్చర్, గంజాయి కల్చర్‌ పెరుగుతోందన్నారు. పేదల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పారు. దీనికి నిదర్శనం విశాఖలో జరిగిన కిడ్నాప్‌ వ్యవహారమే అని తెలిపారు. వైసీపీ నాయకులని ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారని.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని లేఖ ద్వారా చంద్రబాబు కోరారు.

Next Story