అభిమానులు, కార్యకర్తలు ఎవ్వరూ రేపు తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని టీడీపీ అధినేత‌ చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ట్విట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశారు. నా పుట్టినరోజు వేడుకల‌ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు మీరు చేసే ప్రయత్నం అభినందనీయమ‌ని.. కానీ వేడుకలకంటే ఇప్పుడు భద్రత ఎంతో ముఖ్యమ‌ని అన్నారు.

నా పుట్టినరోజు సందర్భంగా సామాజిక సమావేశాలకు దూరంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. దయచేసి మీరు సురక్షితంగా ఉంటూ.. మీ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోండని.. ఇదే మీరు నాకు ఇచ్చే ఉత్తమ బహుమతి అని రాసుకొచ్చారు.

భారతదేశంలో కరోనా శరవేగంతో విస్తరిస్తూ ప్రమాదకారిగా మారుతున్నందున మనల్ని మనమే రక్షించుకోవాలని అన్నారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీలైనంత రక్షణ పొందటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన మూడు సూచనలు అంతా పాటించాలని కోరారు. ఏసీ ఉన్న గదులలో కంటే గాలి, వెలుతురు బాగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లో ఉండటం శ్రేయస్కరం అని అన్నారు. వీలైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండండి. ఎవరినైనా కలవాల్సివస్తే వారితో గడిపే సమయం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. తెలుగువారంతా ఈ మూడు సూచనలు పాటించి, కోవిడ్ నుంచి వీలైనంత రక్షణ పొందండి అంటూ ట్వీట్ చేశారు.


సామ్రాట్

Next Story