సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు.. శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ముఖులు

Celebrities wishes to AP CM Jagan.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను వైసీపీ శ్రేణులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 1:31 PM IST
సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు.. శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ముఖులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను వైసీపీ శ్రేణులు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నాయి. తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా వేద‌పండితులు ఆయ‌న్ను ఆశీర్వ‌దించారు. ఆయ‌న్ను వ్యక్తిగతంగా కలిసి పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలుపగా.. ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ సీఎం జ‌గ‌న్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం జగన్‌ జీవితాంతం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

పూరీ జ‌గ‌న్నాథుడు, తిరుమ‌ల శ్రీవారి ఆశీస్సుల‌తో జ‌గ‌న్ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ తెలిపారు.

సినీ న‌టులు చిరంజీవి, మ‌హేష్‌ కూడా జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. 'హ్యాపీ బర్త్‌డే శ్రీవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు' అంటూ చిరంజీవి ట్వీట్ చేయ‌గా.. 'గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ మరింత అభివృద్ధి చెందాలి. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరపుకోవాలని ఆశిస్తున్నాను' అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు.


Next Story