వివేకా లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్షకు కోర్టు అనుమతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య స్థలిలో దొరికిన లేఖపై

By అంజి  Published on  7 Jun 2023 11:23 AM GMT
CBI Court, ninhydrin test, YS Viveka letter, YS Vivekananda Reddy

వివేకా లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్ష కోర్టు అనుమతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య స్థలిలో దొరికిన లేఖపై నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. హత్యా స్థలంలో దొరికిన లేఖను 2021 ఫిబ్రవరి 11న ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్‌ లేబరోటరీకి సీబీఐ పంపింది. ఫోరెన్సిక్‌ రిపోర్టులో ఒత్తిడితోనే వివేకా ఈ లేఖ రాసినట్లు సీబీఐ గుర్తించింది. ఇక ఇటీవల లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ని సీబీఐ కోరింది. దీనికి నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ తెలిపింది. అయితే ఈ పరీక్షతో లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కోర్టు పర్మిషన్‌ కోసం సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. రికార్డుల్లో ఒరిజినల్‌ లేఖ బదులు కలర్‌ జిరాక్స్‌ అనుమతించాలని సీబీఐ కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సోమవారం తీర్పును రిజర్వు చేసింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు అనుమతి ఇచ్చింది.

Next Story