Nellore: బర్డ్‌ఫ్లూ విజృంభణ.. చికెన్‌ షాపుల మూసివేతకు కలెక్టర్‌ ఆదేశం

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాలు జారీ చేశారు.

By అంజి
Published on : 16 Feb 2024 7:29 AM IST

Bird flu, Nellore district, chicken shops, Nellore Collector

Nellore: బర్డ్‌ఫ్లూ విజృంభణ.. చికెన్‌ షాపుల మూసివేతకు కలెక్టర్‌ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి విస్తరించకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో కోళ్లు చనిపోయాయని తెలిపిన కలెక్టర్‌.. కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కి.మీ పరిధిలో మూడ్రోజుల పాటు చికెన్‌ షాపులు పూర్తిగా మూసేవేయాలి ఆదేశించారు.

ఒక కిలోమీటర్‌ పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకూడదని తెలిపారు. చనిపోయిన కోళ్లను వెంటనే భూమిలో పాతిపెట్టాలి.. పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బర్డ్‌ ఫ్లూ వ్యాపించిన గ్రామాల్లో డీపీవో, జిల్లా పరిషత్‌ సీఈవో గ్రామసభలు నిర్వహించాలని, ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్‌ షాప్‌ యజమానుల్లో చైతన్యం తేవాలని, ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్‌ చేయించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. గతంలో దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ వ్యాధి సోకి లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.

Next Story