భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు బెయిల్

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది.

By M.S.R  Published on  8 Jun 2023 7:30 PM IST
Bhuma Akhilapriya, Bhargav Ram, bail, TDP, APnews

భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు బెయిల్ 

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మరో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో అఖిలప్రియను, భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న అఖిలప్రియకు కోర్టు ఇంతకు ముందే బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు భార్గవ్ రామ్ కు ఊరట లభించింది. భార్గవ్ రామ్ బెయిల్ పై హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాలలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో ఇటీవల మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కొద్దిరోజుల కిందటే అఖిల ప్రియకు బెయిల్‌ వచ్చింది. మే 17న నంద్యాలలో నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదుతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులపై పోలీసులు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు భూమా అఖిల ప్రియ దంపతులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో అఖిల ప్రియ దంపతులను పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. ఇప్పుడు బెయిల్ పై ఇద్దరూ విడుదలయ్యారు. భూమా అఖిల ప్రియకు కాస్త ముందుగానే బెయిల్ వచ్చింది.

Next Story