ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్టు
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిల ప్రియ , ఆమె అనుచరులను నంద్యాల పోలీసులు ఆళ్లగడ్డలో అరెస్ట్ చేశారు. భూమా అఖిల ప్రియను నంద్యాల
By అంజి Published on 17 May 2023 12:15 PM ISTఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్టు
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిల ప్రియ , ఆమె అనుచరులను నంద్యాల పోలీసులు ఆళ్లగడ్డలో అరెస్ట్ చేశారు. భూమా అఖిల ప్రియను నంద్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అఖిలప్రియతోపాటు ఆమె అనుచరులపై అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదుయ్యాయి. అఖిలప్రియ పి ఎ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ ఉదయం అఖిల ప్రియ ఇంటికి వెళ్లిన పోలీసులు.. నిన్న జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం అరెస్ట్ చేశారు. ఆమె కనుసన్నలోనే ఈ దాడి జరిగిందని నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది.
నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అనుచరులు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. మంగళవారం టీడీపీ నేత లోకేష్ పాదయాత్ర సందర్భంగా నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో సుబ్బారెడ్డి గాయపడ్డారు. ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. మరోవైపు నంద్యాల్లో ఏవీ సుబ్బారెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.
భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలకు.. ఒకరంటే, ఒకరికి పడదు. గత ఎన్ని కల సమయంలో కూడా ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై హత్యకు కుట్రపన్నగా, పోలీసులు భగ్నం చేశారు. ఈ హత్యకు అఖిలప్రియనే సుఫారీ ఇచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా లోకేష్ యువగళం పాదయాత్రలో మరో నంద్యాలలో విభేదాలు భగ్గమన్నాయి. ఈ గొడవకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం.