నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఆస్తుల్ని రాసిస్తా అంటున్న బాలినేని శ్రీనివాస రెడ్డి

Balineni Srinivas Reddy challenged Janasena Leaders. ఏపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్

By M.S.R  Published on  23 April 2023 10:15 AM GMT
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఆస్తుల్ని రాసిస్తా అంటున్న బాలినేని శ్రీనివాస రెడ్డి

ఏపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు విశాఖపట్నం జనసేన నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. విశాఖ జనసేన కార్పొరేటర్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. తనకు సినీ ఇండస్ట్రీలో దిల్ రాజు లాంటి స్నేహితులు చాలా మంది ఉన్నారని తెలిపారు. అంతమాత్రాన సినిమాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించడం సరికాదన్నారు. జనసేన నేత చేసిన ఆరోపణలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సూచించారు. మైత్రి మూవీ మేకర్స్ లో పెట్టుబడులు పెట్టిన ప్రజాప్రతినిధిని వదిలేసి తనను టార్గెట్ చేయడం వెనుక ఏదో కుట్ర ఉందన్నారు. విచారణలో తాను పెట్టుబడులు పెట్టినట్లు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తన ఆస్తుల్ని మీకే రాసిస్తానని అన్నారు. తన మీద ఆరోపణలు చేసిన జనసేన కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.

మైత్రీ మూవీస్‌లో నేను కానీ.. మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాను. రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సహకరిస్తే మైత్రీ మూవీస్‌లో పెట్టుబడులు పెట్టినట్లా..? వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరమైతే సహకరిస్తా. వైజాగ్‌లో మా కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయటం సరికాదన్నారు.


Next Story