ఒంటి కన్నుతో మేకపిల్ల జననం.. చూడడానికి ఎగబడిన జనం
Baby goat born with one Eye.ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో వింత మేకపిల్ల ఒంటి కన్నుతో జననం.
By తోట వంశీ కుమార్ Published on
24 Feb 2021 3:33 AM GMT

ఈ ప్రపంచంలో వింతలకు కొదవ లేదు. నిత్యం ఏదో ఒక చోట వింతలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనకు తెలిసేవి కొన్నే. ఇప్పటికే రెండు తలలతో దూడ, కోడి పిల్లలా మేక జన్మించడం వంటి ఘటనలను మనం గతంలో చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో వింత మేకపిల్ల జన్మించింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నరసింహారావు పాలెంలో వేముల సాంబయ్య రైతు ఇంట్లో ఒంటి కన్నుతో మేకపిల్ల జన్మించింది.
కన్ను, ముక్కు, నోరు ఒక పక్కకు నాలుక ఓ పక్కకు రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి పైపులతో పాలు పడుతున్నట్లు సాంబయ్య తెలిపాడు. దీన్ని ఎలాగైనా బ్రతికించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఈ వింతను చూసేందుకు రైతు ఇంటికి వస్తున్నారు. కాగా.. ఈ విషయమై పశు వైద్యాధికారిని సంప్రదించగా.. జన్యులోపం కారణంగా ఇలా జరిగిఉంటుందని చెప్పారు. అయితే.. ఇలా జన్యులోపంతో జన్మించినవి ఎక్కువ రోజులు జీవించలేవని తెలిపారు.
Next Story