కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి

By Medi Samrat  Published on  7 Jun 2024 7:30 PM IST
కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవుల్లో ఉన్న నాయకులను, వారి సహచరులను టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు కొందరు కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. సమాచారం అందుకున్న పోలీసులు వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు.


గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడి జరిగింది. వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ ఫ్లోర్‌ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్‌లో ఉన్న వల్లభనేని వంశీ వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతూ ఉన్నాయని వైసీపీ సోషల్ మీడియా అకౌంట్స్ లో వీడియోలను పోస్టు చేస్తున్నారు.


Next Story