నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు(గురువారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి జి.భరత్ కుమార్, బీఎస్‌పీ నుంచి ఎన్.ఓబులేసు, మరో ఐదు మంది గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
2,13,388 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,07,367 మంది మహిళలు, 1,05,960 మంది పురుష ఓటర్లు. ఇందుకోసం 279 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో చేయడంతో పాటు 78 వెబ్‌క్యాస్టింగ్ చేస్తున్నారు. 123 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత్రను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1409 మంది పోలింగ్ సిబ్బంది, 1100 మంది పోలీసులు పాల్గొంటున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నె 26న చేపట్టనున్నారు.