ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. నేడు ఈ జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు!

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

By -  అంజి
Published on : 10 April 2026 7:18 AM IST

Andhra Pradesh Weather, APSDMA Heatwave Alert, North Coastal Andhra Heat, Rayalaseema High Temperatures, Summer Safety Tips AP

ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. నేడు ఈ జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు!

అమరావతి: శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలకు అవకాశం ఉందన్నారు.

నేడు విజయనగరం(జి) బాడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర , మన్యం(జి) బలిజిపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, పోలవరం (జి) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు (జి) కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో(16) తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నేడు వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్న మండలాల పూర్తి వివరాలు కింద ఉన్నాయి.

Next Story