ఏపీలో పోలింగ్.. సొంతూళ్లకు క్యూ కడుతున్న ఓటర్లు
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ యువత, పలు రాష్ట్రాలలో నివసిస్తున్న ఏపీ ప్రజలు ఓటింగ్ అంటే చాలు సొంత రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉంటారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 2:30 PM GMTఏపీలో పోలింగ్.. సొంతూళ్లకు క్యూ కడుతున్న ఓటర్లు
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ యువత, పలు రాష్ట్రాలలో నివసిస్తున్న ఏపీ ప్రజలు ఓటింగ్ అంటే చాలు సొంత రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో పని చేసే వృత్తి నిపుణులకు ఓటు అనేది ఎంతో అమూల్యమైనదని తెలుసు. మే 13న జరగనున్న మెగా ఎన్నికల (అసెంబ్లీ, లోక్‌సభ) కారణంగా ఈ వారాంతంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సొంత ఊళ్లకు చేరుకోవాలని అనుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో, టీడీపీ నారా చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్యమంత్రుల నేతృత్వంలోని ప్రభుత్వాలు అనేక ఐటీ కంపెనీలను హైదరాబాద్ లో స్థాపించారు. టెక్ నిపుణులకు హైదరాబాద్ హబ్‌గా నిలిచింది. అయితే, 2014లో రాష్ట్ర విభజన తరువాత, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టంకట్టారు. హైదరాబాద్‌లో స్థిరపడిన చాలా మంది టెక్కీలు పండుగల సమయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చేవారు. ఇప్పుడు ప్రధాన పండుగల మాదిరిగానే ఎన్నికలు కూడా మారడంతో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మళ్లీ సొంత ఊళ్లకు ఆకర్షితులవుతున్నారు.
హైదరాబాద్, బెంగుళూరు, అమెరికా నుండి ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటున్న కొంతమంది యువత, టెక్కీలతో NewsMeter మాట్లాడింది. వారు ఓటు వేయడానికి ఎందుకు వస్తున్నారో.. దాని వెనుక ఉన్న కథనాలను మీతో మేము పంచుకుంటూ ఉన్నాం.
చాయ్, ఓటింగ్ మిస్ కాకూడదు:
విశాఖపట్నంకు చెందిన రాఘవ్, రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఎన్నికల ఫలితాలపై తన ఆసక్తిని వ్యక్తం చేశారు. బెంగుళూరులో పనిచేస్తున్న మురళి పోలింగ్ రోజు సెలవు తీసుకుని ఆంధ్రాకు వస్తున్నారు. “నా ఓటు రైల్వే కోడూరులో ఉంది. నాకు పోలింగ్ రోజు సెలవు లేదు అయినా నేను ఆ రోజు సెలవు తీసుకున్నాను. నాకు ఓటు వేయడం అంటే ఉదయాన్నే తాగే వేడి వేడి టీ లాంటిది’’ అన్నారు మురళి.
ప్రయాణానికి డబ్బులు చెల్లిస్తున్న రాజకీయ పార్టీలు:
ఈ ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు ప్రయాణ ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాయి. ఈ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న, ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు ఉన్న సాంకేతిక నిపుణుల డేటాను సేకరిస్తున్నాయి. “ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకుని ఉంటే పార్టీ నాయకులు డబ్బులు ఇస్తామని మాకు చెప్పారు. ఒక వేళ చేసుకోకుంటే బస్సులో సీట్లను వాళ్లే బుక్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ రెండూ అదే ఆఫర్‌ని అందిస్తున్నాయి’’ అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటరు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న మరో ఓటరు మాట్లాడుతూ “నా నియోజకవర్గంలోని స్థానిక పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా తమ పార్టీకి ఓటు వేస్తారని, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారికి ప్రయాణం అందిస్తామని పలువురి ఇళ్లను సందర్శిస్తున్నారు. నా ఓటు వేసిన తర్వాత వారు నా టిక్కెట్టు డబ్బులు తిరిగి చెల్లిస్తారని నాకు మాట ఇచ్చారు" అని తెలిపారు.
ప్రత్యేక బస్సుల ఏర్పాటు:
అంతేకాకుండా యువ ఓటర్లను సమీకరించడానికి పార్టీ అభ్యర్థులు బెంగళూరు నుండి వివిధ నియోజకవర్గాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటరు సునీల్ ప్రకారం, పార్టీ అభ్యర్థులు బెంగళూరు నుండి తమ నియోజకవర్గాలకు ప్రత్యేక బస్సులను ప్లాన్ చేశారు. “ఒక సాధారణ పికప్ పాయింట్ ఎంపిక చేస్తారు. అక్కడ నుండి బస్సులు ప్రారంభమవుతాయి. ఇదంతా ప్రాంతం/నియోజకవర్గం మార్గంపై ఆధారపడి ఉంటుంది." ఉంటుందని వివరించారు.
మీ నాయకుడిని ఎంచుకోవడానికి ఉత్తమ అవకాశం
బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త దీప్ కృష్ణ వంటి కొందరికి, ఓటుహక్కును వినియోగించుకోవడం అనేది కేవలం కర్తవ్యం మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ. మార్పును తీసుకుని రావడానికి.. ఇష్టపడే నాయకులకు మద్దతు ఇవ్వడానికి ఒక అవకాశం. ఇదే సమయంలో మంచి చేయని నాయకులపై ప్రతీకారం కూడా తీర్చుకోగలరు." అని దీప్ కృష్ణ అన్నారు. ఆయన సతీమణి హస్వానీ రెడ్డి కూడా ఓటు వేసేందుకు ముంబైకి వెళ్తున్నారు. దీప్ కృష్ణ యువతకు రాజకీయాల మీద అవగాహన ఉండాలని సూచించారు. ఓటు హక్కును పలు అంశాలకు ముడిపెట్టడం చాలా ముఖ్యమని కూడా అన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతకు ఆశ చూపుతున్న ఎన్నారైలు:
2,000 మంది తెలుగు మూలాలున్న ఎన్నారైలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేశారు. 120 దేశాల నుండి, ఔత్సాహికులు నాయుడుకు మద్దతుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ, ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, రాష్ట్ర యువతకు లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.