ఏపీలో పోలీసుల సేవలు... షెభాష్ అంటున్నారు!
AP police service. ఏపిలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ సేవలు చూసి అందరూ ఎంతో సంతోష పడుతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2021 12:22 PM ISTఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10.30 గంటల వరకు 33.21 శాతం పోలింగ్ నమోదయ్యింది. పొలింగ్ మందకొడిగా సాగుతుంది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. సుమారు 7 వేల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా గిరిజా శంకర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ బాధితులు స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా ఈ యాప్ రూపొందించారు.
ప్రజలు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా 'ఏపీ పోలీస్ సేవ' పేరిట ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఏపిలో ప్రజలతో పోలీసులు సన్నిహితంగా ఉండాలని.. ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరించాలని సీఎం జగన్ చెబుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపిలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ సేవలు చూసి అందరూ ఎంతో సంతోష పడుతున్నారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం కేంద్రంలో ఓటు వేసేందుకు వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకెళ్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ హరిప్రసాద్.
ఒక్క ఓటు ఎంతో ప్రాధాన్యతన ఉన్న నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్న నేపథ్యంలో ఓ వృద్దురాలు తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావడంతో స్వయంగా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ ఆమెను భుజాన వేసుకొని పోలింగ్ బూత్ వద్దకు తీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రక్షణ కోసం మాత్రమే కాదు.. ఫిజికల్ గా ఇబ్బందులు ఉన్న వారికి కూడా తమ సేవలు అందిస్తామని అంటున్నారు పోలీసులు.
ఈ మద్యే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శిరీష ఇటీవల ఓ అనాథ శవాన్ని కిలోమీటర్ వరకూ తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లారు.ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.