ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి వెల్లంప‌ల్లి సూర్య‌నారాయ‌ణ గురువారం క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 80 సంవ‌త్స‌రాలు. విశాఖపట్నం బ్రాహ్మణ వీధిలో ఆయన తన స్వగృహంలో సూర్యనారాయణ తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. తన ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మంత్రులు అప్పలరాజు, మేకపాటి గౌతమ్ రెడ్డి లు కూడా సంతాపం తెలియ‌జేశారు. కాగా.. వెల్లంప‌ల్లి తండ్రి అంత్య‌క్రియ‌లు విజయవాడ భవానీ పురం పున్న‌మీఘాట్ హిందూ శ్మ‌శాన‌వాటికలో నిర్వహించనున్నారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story