ఏపీ ఆయుష్ శాఖలో 358 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ, ఆయుష్ (AYUSH) విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.

By -  అంజి
Published on : 13 Feb 2026 6:38 AM IST

AP AYUSH Recruitment 2026, National Ayush Mission (NAM) AP jobs, Minister Satya Kumar Ayush updates, Ayurveda & Homeopathy college jobs AP, Contract teaching posts in AP medical colleges

ఏపీ ఆయుష్ శాఖలో 358 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ, ఆయుష్ (AYUSH) విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 358 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయనున్నారు. వీటిలో వైద్య నిపుణుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరికీ అవకాశం ఉంది.

మెడికల్ & స్పెషలిస్ట్‌ల విభాగంలో డాక్టర్లు, సైకియాట్రిస్ట్‌లు, థెరపీ & ఫిట్‌నెస్‌ విభాగంలో ఫిజియోథెరపిస్ట్‌లు, పంచకర్మ థెరపిస్ట్‌లు, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, సపోర్టింగ్ స్టాఫ్‌ విభాగంలో మల్టీ పర్పస్ వర్కర్లు, స్వీపర్ల పోస్టులు ఉన్నాయి. అలాగే బోధన, బోధనేతర సిబ్బంది కొరతను తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం అని వివరించారు.

ప్రజలకు ఆయుర్వేదం, హోమియోపతి, యోగా వంటి ప్రకృతి వైద్య విధానాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడం ఈ మిషన్ ఉద్దేశ్యం. కాగా ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అర్హత గల అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవడం మంచిది.

Next Story