భద్రాద్రి రాముడికి మంత్రి కొడాలి నాని కానుక

AP Minister presents gold crown to Bhadradri temple.తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి రామ‌య్య‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2021 7:10 AM GMT
భద్రాద్రి రాముడికి మంత్రి కొడాలి నాని కానుక

తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి రామ‌య్య‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొడాలి నాని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. అర్చ‌కులు మంత్రి కొడాలి నాని కుటుంబంతో స్వామి వారికి ప్ర‌త్యేక పూజాలు నిర్వ‌హించి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. అనంత‌రం మంత్రి కొడాలి నాని స్వామి వారికి రూ.13ల‌క్ష‌లు విలువ జేసే బంగారు కిరీటాన్ని కానుక‌గా స‌మ‌ర్పించారు. స్వ‌ర్ణ కిరీటాన్ని ఆల‌య అర్చ‌కుల‌కు అంద‌జేశారు.

అనంతరం మీడియాతో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు మరింత శక్తిని ఇవ్వాలని సీతారామచంద్రస్వామి వారిని ప్రార్థించిన‌ట్లు చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలోని ప్ర‌జ‌లు ఎలాంటి క‌ష్టాలు లేకుండా జీవించాల‌న్న‌దే సీఎం జగన్ ఆకాంక్ష అని చెప్పారు.

Next Story