ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాక్‌.. అశ్లీల చిత్రాలు పోస్ట్

AP Minister Goutam Reddy twitter account hacked.ఇటీవ‌ల సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. అందిన‌కాడికి

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 10 April 2021 2:41 PM IST

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాక్‌.. అశ్లీల చిత్రాలు పోస్ట్

ఇటీవ‌ల సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. అందిన‌కాడికి దోచుకుపోవ‌డంతో పాటు ప‌లువురి అకౌంట్ల‌ను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా.. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ నేప‌థ్యంలో మంత్రి ట్విట‌ర్ ఖాతాలో హ్యాక‌ర్లు అశ్లీల చిత్రాల‌ను పోస్ట్ చేశారు. అయితే.. వీటిని మంత్రి ఆల‌స్యంగా గుర్తించారు. వెంట‌నే వాటిని తొల‌గించారు. అనంత‌రం దీనిపై ట్విట‌ర్‌కు, సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యాన్ని మంత్రినే స్వ‌యంగా వెల్ల‌డించారు. త‌న ట్విట‌ర్ ఖాతా ఫాలో అవుతున్న వారంద‌రికీ మంత్రి క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేశారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు..





Next Story