ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 8న రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ పట్టుదలతో ఉండగా.. ఎన్నికలకు సరేమీరా అని ప్రభుత్వం అంటోంది. దీంతో ఇద్దరి మధ్య గత కొద్దిరోజులు పెద్ద యుద్దమే నడుస్తుందని చెప్పాలి. తాజాగా నిమ్మగడ్డకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు లేనట్లేనని స్పష్టం అవుతోంది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై నేడు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరుపున ఏజీ, ఎస్ఈసీ తరుపున న్యాయవాది అశ్వనీకుమార్ రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. ఏకకాలంలో ఎన్నికలు కరోనా వ్యాక్సినేషన్ కష్టమవుతుందని ఏజీ కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది. కాగా, హైకోర్టు తీర్పుపై డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు సమాచారం.