ఏపీ ఎస్ఐ నియామక ప్రక్రియలో హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే

By Srikanth Gundamalla  Published on  30 Nov 2023 1:35 PM IST
ap high court, police, recruitment,

ఏపీ ఎస్ఐ నియామక ప్రక్రియలో హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఎస్ఐ నియామక ప్రక్రియపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఎత్తు కొలిచే విషయంలో అన్యాయం జరిగిందని గతంలో హైకోర్టును అభ్యర్థులు ఆశ్రయించారు. దాంతో.. ఫిలితాలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఎస్‌ఐగా పని చేసిన వ్యక్తిని కూడా ఎత్తు సరిపోలేదంటూ తిరస్కరించారని ఏపీ హైకోర్టుకు అభ్యర్థుల తరఫు న్ఆయయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులందరి ఎత్తును కోర్టు సమక్షంలోనే తీసుకుంటామని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్లు అంతా సిద్ధంగా ఉన్నారని గురువారం విచారణ సందర్భంగా వారి తరఫు లాయర్‌ శ్రావన్‌ కుమార్‌ హైకోర్టు కు తెలిపారు. వాదనలు విన్న ఏపీ హైకోర్టు పిటిషనర్లు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Next Story