ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది రానున్న 48 గంటల్లో నైతిరు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు తీరంవైపు ప్రయాణించి ఈనెల 25న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈనెల 24,25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అలాగే 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇటీవల భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం కాగా , ఇప్పుడు రెండు రోజుల పాటు భారీ వర్షాలు ప్రకటించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కురిసిన వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇప్పుడు ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నారు.

సుభాష్

.

Next Story